SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
కృత్రిమ భావ ప్రాప్తి “లీడర్”
March 7th, 2010 by akkirajub

నిన్న లీడర్ సినిమా చూశా.  చాలా డిస్టర్బ్ చేసే సినిమా అని చెప్పచ్చు.  అలా అని ఇందులో నన్ను కొత్తగా ఆలోచింప జేసి, నన్నేదో సంస్కరించే ప్రయత్నం చేసి అలా డిస్టర్బ్ చేసింది అనుకోకండి. ఈ సినిమాని ఇప్పుడున్న సామాజిక సందర్భంలోంచి చూస్తే, చాలా బాధ కలుగుతోంది.

మన సామాన్యుడి సామాజిక నిస్పృహ రెండు గంటలపాటు తెర మీద కాదు, అంతకన్నా ఎక్కువ దాని ముందు కూర్చున్న ప్రేక్షకులలో ఆవిష్కృత మవుతుంటే  నాకు పట్టరాని దుఃఖం వచ్చింది.   ఎవరన్నా సినిమాల మీద తెగ రెసెర్చిలు చేశేవారుంటే వారికి  నాదో సలహా, విన్నపం.  సామాజిక స్పృహ ఉన్న సినిమాలు గత 50 ఏళ్ళలో ఎలా మారాయో గమనించండి.

మరీ దూరం స్వాతంత్ర్యోద్యమ కాలం, స్వతంత్ర భారతంలోని మొదటి రెండు దశాబ్దాల కాలం నాటి సినిమాల గురించిన అవగాహన నాకు లేదు.  పరుచూరి శ్రీనివాస్ చెప్పాల్సిందే.

వాటి తర్వాత వచ్చిన    “మనుషులు మారాలి”, “బలి పీఠం”, “మరో మలుపు” లాటి సినిమాలు  మనుషుల్లో రావల్సిన మార్పుల గురించిన సినిమాలు.  ఆధునిక సమాజంలో  పౌరుడి సంస్కారం ఎలా ఉండాలి, బాధ్యతలు ఎలా ఉండాలి అని చెప్పే చందాన అవి ఉండేవి.

ఆ తర్వాత ఎమర్జెన్సీ కి అటూ ఇటూగా.  సైద్ధాంతిక రాజ కీయాల మీద ప్రజలకి నమ్మకం ఉన్న రోజున విప్లవం సినిమాలు వచ్చాయి.  “ఎర్ర మల్లెలు”, “విప్లవ శంఖం”,  “రంగుల కల”  చెప్పలేనన్ని సినిమాలు.  ఇవి కూడా సైద్ధాంతిక ప్రాతిపదిక మీద వచ్చినా, ఇందులో కూడా సినిమాటిక్  విలన్లే ఉండి, ఆ ఒకళ్ళిద్దరిని సంహరించడమే విప్లవమనీ  చాల అమాయక మయిన పరిష్కారాలు చూపించిన సినిమాలు అవి.   అయినా సరే  ఓ సైద్ధాంతిక ప్రాతి పదికన బాధ్యత వహిస్తూ కలిసికట్టుగా ఉద్యమించే ప్రజలూ, బాధితులూ వాటిల్లో ఉంటారు.

ఆ తర్వాత కాలంలో విద్యార్థి సంఘాలు దాదాపు మూత పడిపోయాయి.  మన రిఫార్ములూ, MNC లూ,   H1 వీసాలూ, కోచింగ్ సెంటర్ లనబడే జైళ్ళూ  ప్రధానంగా విద్యార్థు లని సమాజానికి ఏ బాధ్యత వహించని వాళ్ళగా,  వహించ నవసరం లేని వాళ్ళుగా తయారు చేసాయని మనకందరికీ తెలుసు.   “బాగా చదువుకున్న వాళ్ళే నక్సలైట్లు అవుతారట”   అనే మాటలు చదువుకునే టప్పుడు వినే వాళ్ళం. దానికి భిన్నంగా న్యూస్  పేపర్ కూడా చదవని విద్యార్థులు ఆ తర్వాత కాలంలోనే తయారయారు.

ఈ దశలోనే  రాజకీయానికి బ్లాంక్ చెక్ ఇవ్వబడింది.  విద్యార్థులూ, మధ్యతరగతీ  జరుగుతున్న వ్యవహారాలనించి పూర్తిగా బాధ్యత వహించడం మానేసివన సందర్భం.   ఏ సొంత అభిప్రాయమూ ప్రకటించలేని సందర్భం.    మిస్ యినివర్స్,  మిస్ వరల్డ్ గెలవడం  అభివృద్ది అనుకున్న సందర్భం.    కోక్, పెప్సీలు తక్కువ ధరకే దొరకటం  గురించి మధ్యతరగతి తెగ ఆనంద పడ్డ సందర్భం.   వీటన్నిటి వెనకా రాజకీయం  సామాన్యుడు ఊహించలేని స్థితిలోకి చేరుకున్న వైనం.  కోటి రూపాయల అవినీతి అంటే ముక్కున వేలేసుకున్న వాళ్ళకి “వెయ్యి కోట్లు”  “ఐదు వేల కోట్లు”  లాంటివి మామూలు విషయాలయి పోయాయి.   అంత డబ్బు ఎక్కడ తయారవుతోంది. ఎవడికీ నష్టం లేకుండా అంత ఎలా ఒక చోట చేర గలదూ అనేది  తెలియక కాదు, “మనకి సంబంధం లేని విషయం” అనుకునే వాళ్ళే అందరూ తయారయిన పరిస్థితి ఇది.

ఈ సందర్భంలో కొత్త రకం “మనం బాధ్యత వహించనక్కరలేని” సినిమాలు వచ్చాయి.   సూపర్ హీరో సినిమాలు.    భారతీయుడు, అపరిచితుడు,  రోజా , దిల్సే, స్టాలిన్  లాంటి సినిమాలు.   సర్వం నాశనమయిపోయింది, ఎవడో కథానాయకుడు  వచ్చి  ఏదో  చేయాలి తప్పా మన చేతుల్లో ఏమీలేదనే తిరోగమన వాదాన్ని పెంచిపోషించే సినిమాలు.

అవీ దాటేశాం.   ఆ తర్వాత వచ్చిన  సినిమాలు ఇంకో రకం సూపర్ హీరోలని పట్టుకొచ్చాయి.   వీళ్ళు  NRI  హీరోలు.  స్వదేశ్  షారూఖ్ ఖాన్ లాంటి వాళ్ళన్న మాట.   ఈ లీడర్ ఆ కోవకి చెందిన వాడే.   కుప్ప   కూలిపోయిన  మన ప్రజాస్వామిక వ్యవస్థ లోంచి  బయట పడి, పాశ్చాత్య నాగరిక ప్రపంచాన్ని చూసిన సంస్కారంలోంచి  మనమెందుకు ఇలా లేము అని మథన పడ్డ కొందరు యువకుల అమాయకపు ఆవేశం, నిజాయితీ వీటిల్లో ఉంటుంది.

ఈ ఆలో చనల ప్రమాదం ఏంటంటే,  వీటి వెనక మళ్ళీ తెలియకుండా చెప్పే కొన్ని సూత్రీకరణలుఉంటాయి.    ఇక్కడి సామాన్యుడి మీద నమ్మకం లేక పోవడం.  ఇక్కడి సామాన్యుడు బాధ్యత వహించ నక్కర్లే కుండా కొత్త రకం హీరోల కోసం ఎదురు చూడాలనడం.   ఇలాటివి.   ఎలగూ సూపర్ హీరో  అపరిచితుడు గానీ, NRI  గానీ రాడని మనకి తెలుసు కాబట్టి, మనకి ఖచ్చితంగా మిగిలేది,  నిరాశ, నిస్తేజం.  ఎలాగూ అందరూ దోచేసుకుంటున్నారని నమ్మేశాం కాబట్టి,  ఇక మనమేం చేసినా పర్లేదనే మనకి  పనికొచ్చే వాదం.    రాజ కీయ నాయకుడు ట్రాఫికి ని గంటకి పైగా ఆపగాలేంది, నేను ఈ అర కిలో మీటరు రాంగ్ రూటు లో వెళ్ళి కాస్త ట్ర్ర్ర్రాఫిక్ కి అడ్డం పడితే తప్ప్మేంటి?  వాడు వెయ్యి కోట్లు తినగా లేంది నేను వెయ్యి రూపాయలు తింటే తప్పేంటి?   అప్పుడప్పుడూ ఇలాటి సినిమాలు చూసి, దానికి బాధ్యత ఆ వెయ్యికోట్ల రాజకీయ నాయకుడికీ,  ఎప్పటికీ రాని ఈ సూపర్ హీరో లీడర్ కీ పంచేసి  ఇంటికిపోవడం.    ఇదీ మిగిలేది, ఇలాటి సినిమాల తర్వాత.

ఇన్ని సినిమాల మధ్యలో ఒకే ఒక్క సినిమా నా దృష్టిలో లీడర్  ని చూపించిన సినిమా.  అది రుద్రవీణ.   ఓ వ్యక్తి  విప్లవకారుడవడానికి, మొట్ట మొదట సంఘర్షించేది తనతోనే.   పేలే లాండ్ మైన్లన్నీ తన గుండేల్లో తానే పేల్చుకుంటాడు మొదటగా.   ఆ తర్వాత కుటుంబంతో.  ఆ తర్వాత ఊరితో.  దానికి ఓ ఉద్యమ రూపం వచ్చాక నాయకు డవుతాడు.   చెప్పలేనన్ని  త్యాగాలు చేస్తాడు దారిలో.

తెర మీద ఏం జరిగిందనేది కాదు.   తెర ముందు కూర్చున్న వాడికి మాత్రం కొంత కృత్రిమ భావ ప్రాప్తి ని, మరింత నిస్తేజాన్నీ, బాధ్యతా రాహిత్యాన్నీ నింపే సినిమా ఈ లీడర్.

“ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోస పోకుమా” అని మహా కవి ఏనాడో చెప్పినా మనకి అర్థం అవదు.


9 Responses  
 • Ashok Vedagiri writes:
  March 7th, 20105:55 amat

  Akki it requires 3 beers for anyone who reads your blog about Leader movie, i’m going to have….you have to pay for it 🙂

 • కత్తి మహేష్ కుమార్ writes:
  March 7th, 20107:19 amat

  “యాంగ్రీ మిడిల్ క్లాస్” సినిమాలు
  http://navatarangam.com/2010/02/angry-middleclass-films/

 • alapati ramesh babu writes:
  March 7th, 20108:11 amat

  you are given good headlines for “leader” picture. i think so there is no talent except ntr,anr,chiru and now ramanaidu family persons.these are all
  invester’s they keep us in dreams only.leader is base less cinema. why sekhar do like these.at last money wins.where is his creativity. what a good theorey “avinithi will be solved by avinithi only”. hell with all review’s.he needs power what ever it may be. leader not any persepective destination. for the chair he ditribute the money to mla’s and marrey big leader daughter.and do bath for visiting of dalith coloney’s.what foolish movie.

 • పారదర్శి writes:
  March 9th, 201011:31 pmat

  3 బీర్లు తాగో, తాగకుండానో మీరు లీడర్ కధ వ్రాస్తే మీ లీడర్ ఏమిటి/ఎలా చేశేవాడు? సినిమా అదో అందమైన కలల ప్రపంచం. కళాసేవ ముసుగులో ఫక్తు వ్యాపారం. ఎన్నో పరిమితులకు లోబడి వారి సినీ నిర్మాణం ఉంటుందన్న విషయం మీకు తెలుసు కదా.సందేశం ఇవ్వాలనుకున్నా, సమాజాన్ని మార్చాలన్నా మనకు ఒక నాయకుడు కావాలి. కార్ల్ మార్క్స్ తన సిద్ధాంతంతో చరిత్ర గతినే మార్చిన విషయం మనకు తెలుసు. Thought is basis for action. లీడర్ లాంటి సినిమాలతో మన రాజకీయ నాయకుల స్వభావ, స్వరూపాలు ప్రజలకు గోచరమవుతాయి. ఇది అభిలషణీయమే కదా! ఇప్పుడు వస్తున్న చెత్త సినిమాలలో, ఈ సినిమా మిమ్ములను ఆలొచింపచేయబట్టే కదా మీరు ఈ రచన చేసింది? గోదావరి చిత్రంలోని రాజకీయాలలో చేరాలని ఆరాటపడే యువకుడి కధ కొనసాగింపే ఈ లీడర్ కధ.

  తుపాకీ గొట్టంలోంచి పొగ వస్తుందో లేక విప్లవం వస్తుందో అనే విషయం లో మీకో స్పష్టత వుంటే మీరే ఒక కొత్త సిద్ధాంత రచనతో సమాజాన్ని మార్చటానికి మీ నాయకుడు ఏమి చేస్తాడో తెలియపరస్తూ ఒక కధ రాయండి. నచ్చితే శేఖర్ కమ్ములనో, శంకరో లేక మరో నాయకుడో మీ కధ ఇచ్చే lead తో ఏమి మార్పు తెస్తాడో -ఆశావాదం తో జీవిద్దాము.

 • srinath writes:
  March 11th, 20107:07 pmat

  cheppandi mari em cheste mana desham bagu padutundi …..

 • srinath writes:
  March 11th, 20107:08 pmat

  v r becoming LEADERS ….. leaders are not born they are made

 • Chandra writes:
  March 28th, 20104:12 pmat

  Akki,

  That was a well thought analysis, especially the way you summarized about the education system, penetration of capitalism into India’s common man’s life in the name of financial reforms. I always pity about the teens these days who became victims of the highly commercialized education system and false prestige of the parents with full of herd mentality.

  Srinath,

  After certain point, no one has to tell you what you have to for your own good. Akki mentioned clearly in the end of the article where the change starts, in your heart and in your thoughts.
  If you’re serious about chage, start with yourself, and then your family, street, town and so on. If you need some inspiration read The Story of My Experiments with Truth by Mohandas Karamchand Gandhi.

 • Vamsi Pavan writes:
  April 17th, 20101:40 amat

  Hi Akki,

  This is the first post I’ve ever started reading in your bunch of writings :). It’s really a thought provoker. Of course, you can’t blame shaker kammula for his narrative as you see cinema is another colorful money business. But I really liked the way you analyzed the movie rudraveena.

  I’ve seen that movie many times, but never analyzed it to your angle – how a leader will evolve. My first reaction to that movie when saw it first time is – an another movie to pin point olden social atrocities and obviously hero has to fight against to them (according any movie standards).

  ఓ వ్యక్తి విప్లవకారుడవడానికి, మొట్ట మొదట సంఘర్షించేది తనతోనే. పేలే లాండ్ మైన్లన్నీ తన గుండేల్లో తానే పేల్చుకుంటాడు మొదటగా. ఆ తర్వాత కుటుంబంతో. ఆ తర్వాత ఊరితో. దానికి ఓ ఉద్యమ రూపం వచ్చాక నాయకు డవుతాడు.

  This is finest definition to any leader. And hands off to Kalatapaswi K.Vishwanath for portraying this definition into a visible character.

  Between, I don’t know that your name is this popular in internet. When I typed Akkiraju in google, only suggestion I got is your complete name.

  Keep your nice pen moving always…

  – Vamsi Pavan

 • akkirajub writes:
  June 1st, 20109:22 amat

  వంశీ,

  రుద్రవీణ దర్శకుడు విశ్వనాథ్ కాదు. K. బాలచందర్.


»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa