వాగే నోరు ఎక్కువకాలం నిశ్శబ్దంగా ఉండదు. దాదాపు రెండేళ్ళు ఏ అక్షరం ముక్కా రాయకుండా ఎవ్వర్నీ విసిగించ కుండా ఎందుకుండి పోయావూ అంటే ఏం చెప్తాం?
ప్రతీ జీవితంలో కొన్ని సందర్భాలుంటాయి. వాటిని అంతకుముందు చూసి ఉండము. ఎలా ఎదుర్కోవాలో తెలీదు.
ఏడవాలనుంటుంది, ఏడవటం మర్చిపోయి చాలాకాల మయుంటుంది. ఓ గంభీరత్వాన్ని, ఓ పొగరునీ ప్రచారం చేసేసుకున్న “ఇమేజ్” కి ఏడుపు అతకదు.
బాధ మెలికలు తిప్పేస్తుంటుందు. చివరిసారి ఎప్పుడు బాధ పడ్డామా అని చూస్తే నిజాయితీ గా చెప్పడం కష్టం.
పరుగులెత్తీ పరుగులెత్తీ ఆకలికి మించి విస్తరంతా అన్నీ నింపేసుకున్నాక….
పక్కవాడి బాధ గురించి బాధ పడ్డం ఓల్డ్ ఫాషన యి పోయాక…
అవార్డు కథలు అర్థంచేసు కోడానికీ, రాయడానికీ తప్పా బాధ పడ్డం అవసరం లేక పోయాక…
లోపల్నించి కుదిపేయ గల సాహిత్యమే కరువయి పోయాక…
బాధపడ్డం పూర్తిగా అలవాటు తప్పిపోయాక, ఇప్పుడు మళ్ళీ బాధ పడాల్సొస్తే ఎలా? ఏడవలేక, దిగమింగుకో లేక, ఏడ్చేందుకు టైమూ లేక, ఈ సందర్భంలో ఇప్పుడు బాధల్నెక్కడ భరించేది?
ఒక్క సారి కుదిపేసి, ఎక్కణ్ణించి వచ్చామో ఆగి గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్ఠితి ఎదురయ్యాక… ఏమిటి మాట్లాడేది? ఎలా మాట్లాడేది?
(జులై 23, 2008 నాడు మానాన్న, అక్టోబర్ 9, 2008 నాడు మా అమ్మ ఒకరి వెంట ఒకరు ఈ లోకం నించి వెళ్ళిపోయారు – అక్కిరాజు)
లోపల్నించి కుదిపేయగల సాహిత్యం కరువయిపోయాక… అవును మరి – కుదిపేసేలా రాసేఆయన రెండేళ్ళనుంచీ తన మూలాల్ని వెదుక్కుంటూ రాయడం ఆపేసారు.
అక్కిరాజు గారూ, పునః స్వాగతం. పదిహేను రోజులకి ఒకసారి మీ బ్లాగు చూస్తూ ఉండేవాడిని. ఏమన్నా రాసేరేమో అని. వ్రాయడానికి మీరిచ్చిన విరామానికి ఇలాంటి కారణం ఉందన్నది ఊహకందలేదు.
“ఓ గంభీరత్వాన్ని, ఓ పొగరునీ ప్రచారం చేసేసుకున్న “ఇమేజ్” కి ఏడుపు అతకదు”. నిజమే ఆ బాధ వర్ణనాతీతం – తల్లి తండ్రులిద్దరిని. కాలం గాయాలను మాన్పుతుంది. కొంచెం ఓపిక పట్టండి.
జీవన గమనంలో అందరికీ అనుకోకుండా ఎదురొచ్చే సంఘటనలు.
కష్టాలు కన్నీళ్లు మనసుకు అంటకుండా ఉండాలంటే చాలా మానసికపరిపక్వత అవసరం.
తిరిగి మనసు తిప్పుకోండి
అహ్!
You are amongst friends.
welcome back.
ఏడిచి ఎన్నినాళ్ళైనది నా ఎద?
అశ్రులు కన్నుల మోసులన్ తోడిచి ఎన్ని నాళ్ళైనదో?
akkiraju garu …okkosaari manaloni badhku asharaale outlet autayi..vaaga noru,tirige kaalu,raase cheyyi vaati pani avi chestune vundali…meeru raase kadhalu kakarakayalu mee amma gariki ,nannagariki asharanjali anukondi….rambabu