కృత్రిమ భావ ప్రాప్తి “లీడర్”

నిన్న లీడర్ సినిమా చూశా.  చాలా డిస్టర్బ్ చేసే సినిమా అని చెప్పచ్చు.  అలా అని ఇందులో నన్ను కొత్తగా ఆలోచింప జేసి, నన్నేదో సంస్కరించే ప్రయత్నం చేసి అలా డిస్టర్బ్ చేసింది అనుకోకండి. ఈ సినిమాని ఇప్పుడున్న సామాజిక సందర్భంలోంచి చూస్తే, చాలా బాధ కలుగుతోంది.

మన సామాన్యుడి సామాజిక నిస్పృహ రెండు గంటలపాటు తెర మీద కాదు, అంతకన్నా ఎక్కువ దాని ముందు కూర్చున్న ప్రేక్షకులలో ఆవిష్కృత మవుతుంటే  నాకు పట్టరాని దుఃఖం వచ్చింది.   [...]

నాయకుడు లేని చోట…

ఈ వ్యాసాన్ని ఆంధ్రజ్యోతి  జనవరి 10, 2010 ఆదివారం  నాడు ప్రచురించింది. 

ఈ వ్యాసాన్ని  ఆంద్రజ్యోతి లో చదవాలంటే ఇదిగో లంకె!    జ్యోతి లో కొద్దిగా ఎడిట్ చేసి వేశారు.  పూర్తి పాఠం కావాలంటే ఇక్కడ చదవండి.

-ఆక్కిరాజు

_____________________________________

 

ఇప్పుడు రాష్ట్రాన్ని చూస్తుంటే, పూర్తిగా బలహీన పడ్డ పునాదుల మీద నిలబడ్డ పేద్ద భవంతిని చూస్తున్నట్టుగా ఉంది. పూచిక పుల్లల మీద నిలబెట్టిన గుండ్రాయి చందం. ఎవడిని ఎవడూ నమ్మడు. నాయకులన బడే వాళ్ళని [...]

బాలగోపాల్ మరణం తో నా కేమిటి బాధ?

 

సెప్టెంబర్ నెలలో నేను రాజ్ ఘాట్ లో మహాత్ముడి సమాధి దగ్గర ఉన్నాను. అక్టోబర్ లో మార్టిన్ లూథర్ కింగ్ సెంటర్ చూశాను అట్లాంటాలో. ఈ రెంటి మధ్యలో మా అమ్మానాన్నలు చనిపోయి ఓ సంవత్సరం గడిచిన రోజు. భధ్రాచలం డివిజన్లో గిరిజన విద్యార్థుల కోసం ఎంతో శ్రమించిన మానాన్న జ్నాపకాలు మమ్మల్ని ముంచెత్తుతున్న సమయం. అదే సందర్భంలో బలగోపాల్ చనిపోయారని వార్త.

బాలగోపాల్ గురించి అనేక వ్యాసాలు వచ్చాయి. అవన్నీ చదివాక, ఓ మామూలు పౌరుడిగా [...]

నాగార్జున సాగరంలో కథా సమారాధన

 (Click Here For More Pictures)

ఫిబ్రవరి 7, 8  తేదీలలో కొంత మంది తెలుగు కథా రచయితలు కథల గురించి మాత్రమే మాట్లాడాలని ఒట్టు పెట్టుకుని కలిశారు.   “కథల్ని బేరీజు వేసుకోవటం తప్పా వేరే ఉద్దేశం లేదు” అంటూ ఖదీర్ బాబు చాలా చిన్న విషయంగా  శనివారం ఉదయం సంభాషణని ప్రారంభించిన కార్యక్రమం  “ఇరవయ్యొకటవ శతాబ్దం కొత్త డిజైన్ లని సృష్టించాల్సిన శతాబ్దం” అంటూ  చినవీరభద్రుడు ఆదివారం మధ్యాహ్నం ముగించే దాకా సాగింది.

మొత్తం  [...]

జాతస్య…

అరుణ పాణిని గారు  “ముగ్గురు ముసలమ్మలు” అనే కథని  మే 2007 లో రాశారు.    ఆ కథ నేను అప్పట్లో చాలా సార్లు చదివాను.   మనకున్న దురలవాట్లలో, ప్రతీ కథని “మంచి కథ” లేదా “చెడ్డ కథ” అనే ఏదో ఒక కేటగిరీలో పెట్టాలి అని ప్రయత్నం చేయడం.   [...]

ఎలా మాట్లాడేది?

వాగే నోరు ఎక్కువకాలం నిశ్శబ్దంగా ఉండదు.   దాదాపు రెండేళ్ళు ఏ అక్షరం ముక్కా రాయకుండా ఎవ్వర్నీ విసిగించ కుండా ఎందుకుండి పోయావూ అంటే ఏం చెప్తాం?

ప్రతీ జీవితంలో కొన్ని సందర్భాలుంటాయి.   వాటిని అంతకుముందు చూసి ఉండము.  ఎలా ఎదుర్కోవాలో తెలీదు.  [...]

రి సైకిల్ : పటమటి మేఘాలు

రచనా కాలం : మార్చి 1999
ఒరిజినల్ పోస్టు ఇక్కడ

మబ్బులంటే మాకు భయం!
ఒకప్పుడు రెండు పక్కల్నించీ వస్తుండేవి.
చిక్కగా నల్లగా, భయంకరంగా ఉరుముతూ!

ఏ మబ్బులకింద ఉన్నా మనిలేకుండా అందరం భయపడే వాళ్ళం.

" అదుగో, ఆ మబ్బులు ఢీకొంటే, అమ్మో ఇంకేముందీ? అంతా ప్రళయమే, అందరూ ఊడ్చిపెట్టుకు పోతారూ " అని భయ పెట్టేవాళ్ళు. అందరం అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బిక్కు బిక్కు మంటూ చూస్తుండే వాళ్ళం.

అవి పోటా పోటీగా ఉరుముతూ వుండేవి, భయపెడుతూ వుండేవి. [...]

రిసైకిల్ : శీతవేళ రానీయకు రానీయకు!

రచనా కాలం : జూన్ 1999 నా ఒరిజినల్ పోస్టులు వాటి అనుబంధ చర్చలూ ఇక్కడ (1, 2) __________________________

కృష్ణశాస్త్రి అమృతవీణ (గేయసం హిత – 1) గేయం – 141 __________________________

శీతవేళ రానీయకు – రానీయకు శిశిరానికి చోటీయకు – చోటీయకు ఎద లోపలి పూలకారు ఏ [...]

జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది!

(విన్నపం : హమ్ ఆప్కే హై కౌన్, సాజన్, కహోనా ప్యార్ హై, టైటానిక్, నువ్వు నాకు నచ్చావు ఇత్యాదులు గొప్ప సినిమాలు అని నమ్మేవాళ్ళు దయచేసి దీన్ని చదవద్దు! ) _________________________________________________

"జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది!"

నూటికి నూరు పాళ్ళూ సీతారామ శాస్థ్రి నన్ను చూసే రాశాడు అంటాను… మూడు బీర్లకి ముందైనా తర్వాతైనా!

"నీకు నా బాధలు తప్పా ప్రపంచం బాధలు బానే కనపడతాయి." అనే మా ఆవిడే సాక్షి మొదటి మాటకి. [...]

రిసైకిల్ : టైటానికి కథ గురించి

కథ : టైటానిక్ (తానా బహుమతి పొందిన కథ) రచయిత : సురేష్ కథ ప్రచురణ కాలం : జులై 2001 నా అనాలిసిస్ రాసిన కాలం : జులై 2001 నా ఒరిజినల్ పోస్టులు వాటి అనుబంధ చర్చలూ ఇక్కడ (1, 2) __________________________________________

"….యేరుశనగ మిరపల వర్తకాల్లో కొందరిని జంక్సను కాడ మిల్లులు, మరికొందర్ని టేశను [...]